Movie Name : Indrudu Chandrudu (1989)
Music Director : Ilayaraja
Lyricist : Sirivennela Sitaramasastri
Singer : S.P.Bala Subramaniam
ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు
చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరొకో
పదరో చిటపటలాడే ఈడుకు చిక్కిదిగో
కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో
ఎదలో కితకితపెట్టే మల్లెల చిందిదిగో
చెక్కిలినొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కునురో
చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరిబిక్కిరి తప్పదురో
అక్కర తీర్చే అంగడిరో
అద్దాల అందాలు అందాలి పదరా
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు
చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానియిరో
మరిగే కలతకు జాణలదానా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా
అత్తరుసోకే కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా
ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా
వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు
చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా
Kudos to సిరివెన్నెల గారు for such great lyrica
ReplyDelete