Saturday, 10 December 2016

Poruginti Mangala Gowri vesukkunna golusu chudu పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు Subhalagnam(1994)

Subhalagnam(1994)

Singers   :  S P balu , Chitra
Lyrics     :  Sirivennela Sitarama Sastry

పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు మనకి మల్లే ఎవరు ఉన్నారూ ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళూ మనబతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దె పొరుగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే నెత్తిన పెట్టుకు చూసే మొగుడూ నీకూ ఉన్నాడే అందని పళ్ళకు అర్రులు చాచీ అల్లరిపడొద్దే మనకిలేక అదో ఏడుపా పరులకుంటె మరో ఏడుపా ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే అందం నీ సొంతం ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా ఉన్నదానితో మనం సద్దుకుంటే మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్నూ నీ డాబు కోసం పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు పలానా వారి మిసెస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా ఆ బోడి పదవికనీ అప్పోసోప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా కాణీకి కొరగాని పరువూ ఓ పరువేనా మగాణ్ణి తూచేదీ వాడి పర్సు బరువేనా. డబ్బులేని దర్పమెందుకు అయ్యో చేతగాని శౌర్య మెందుకూ నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే ఇనప్పెట్టె నే వరించి ఉండాల్సిందే పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు .ఏడిసారు నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు మనకిలేక అదో ఏడుపా పరులకుంటె మరో ఏడుపా మనబతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు


Poruginti mangala gowri vesukunna golusu chudu yedurinti pinni gari kasula peru chudu irugu porugu vallu bhale bagupaddaru naga natra TV gatra konukkunnaru manaku malle yevaru unnaru usurantu ilaa yennallu mana batukemo itta tagalabadindi yekkada vesina gongali akkade undi Pakalla padu gola pattinchukovaddi poruginti pullakura tega mechukovadde nettina pettuku chuse mogudu nekuu unnade andani pallaku arrulu chachi allari padodde manaki leka ado yedupaa parulakunte maro yedupaa yenduke itta roju medadu tintavu inti guttantaa veedhini pettukuntavu Kantamma garu katte cheera kareedaina lede papam tama jeetam neta cheera kattukunna kottavachinattu unde andam ne sontam utti matalenni anna na sarada teeraduga unnadanitone manam sardukunte manchidiga kattukunnadani sambaram teerchadame purusha lakshanam sampadalone ledu santosham champake nannu ne dabu kosam Palana vari Mrs antu antaa mechukunte meke goppa kaadaa aa bodi padavikani appo tappo cheyyamante ullo paruvu podaa khaniki koragani paruvu oo paruvena maganni tuchedi vadi purse baruvena dabbu leni darpamenduku chetagani shouryamenduku neku mogudayye yogyatha manishiki lede inappettene varinchi undalsinde Poruginti mangala gowri vesukunna golusu chudu yedurinti pinni gari kasula peru chudu irugu porugu vallu bhale bagupaddaru, yedisaru naga natra TV gatra konukkunnaru manaku malle yevaru unnaru usurantu ilaa yennallu mana batukemo itta tagalabadindi.

No comments:

Post a Comment